అఖిలప్రియకు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత !

అఖిలప్రియకు కోర్టు షాకిచ్చింది. బెయిల్ వస్తుందని ముందు నుండీ భావిస్తున్నా సరే కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈరోజు నుండి 13వ తేదీ సాయంత్రం వరకు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో బెయిల్ పిటీషన్ కొట్టివేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఉస్మానియా లో వైద్య పరీక్షలు చేయించిన జైలు అధికారులు, ఆమె హెల్త్ రిపోర్ట్ లో ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చడంతో బెయిల్ పిటీషన్ కొట్టివేశారు.

అయితే అఖిలప్రియను ఏడు రోజుల కస్టడీకి బోయన్ పల్లి పోలీసులు కోరగా మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందంటూ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారుపోలీసులు. ప్రవీణ్ రావు, అతని సోదరులతో సంతకాలు చేసిన పత్రాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, సీన్ రికన్స్ట్రక్షన్ తో పాటు కిడ్నప్ కు పాల్గొన్నది ఎవరు అనేది గుర్తించాలని పోలీఉలు పిటిషన్ లో పేర్కొన్నారు. అఖిల ప్రియ భర్త భార్గవ్ ఇంకా పరారీ లోనే ఉన్నాడని అంటున్నారు.