మోడీ లాక్ డౌన్ గొప్పది అంటూ అక్తర్ వ్యాఖ్యలు…!

-

ఎదుటి వాడి సాయం మనకు అవసరం ఉంటే ఆ వ్యక్తి గురించి మనం చేసే భజన అంతా ఇంతా కాదు. వంద మంది లో కనీసం 50 మంది వారి అవసరం కోసం ఎదుటి వాడి భజన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ ఇదే చేస్తుంది. వాళ్లకు ఇప్పుడు మన దేశం నుంచి వైద్య పరికరాలు అవసరం ఉంది. దీనితో మన దేశాన్ని పదే పదే పొగిడే కార్యక్రమాలు చేస్తున్నారు ఆ దేశ మాజీ ప్రస్తుత ఆటగాళ్ళు.

ముఖ్యంగా షోయబ్ అక్తర్ అయితే పదే పదే పోగుడుతున్నాడు. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడిని ఎక్కువగా పొగిడాడు అక్తర్. కరోనావైర‌స్ ను అదుపు చేయడానికి‌ మోదీ ముంద‌స్తుగా తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం చాలా గొప్పదని, సరిహద్దులు ఉన్నప్పటికీ తాను అందరినీ ప్రేమిస్తున్నానని ఆకాశానికి ఎత్తాడు అక్తర్. ఇండియాలో ఫ్యాన్స్ ను పెంచుకోవడానికి తానేమి ఇలా చెప్పట్లేదని వ్యాఖ్యానించాడు.

హలో యాప్ లో ఆదివారం లైవ్ లోకి వచ్చాడు. తన జీవితంలో కష్టపడకుండా ఏది లభించలేదని వ్యాఖ్యానించాడు. ఓ అభిమాని టి 20 వరల్డ్ కప్ గురించి అడగగా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా జరిగే ఛాన్సస్ కనిపించడం లేదని చెప్పాడు. ఇక మన దేశం క్రికెట్ వాళ్ళ దేశం తో క్రికెట్ ఆడాలని కూడా అక్తర్ విజ్ఞప్తి చేసాడు. తమకు కరోనా సాయానికి డబ్బులు కావాలని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news