ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పవన్ ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. ఎందుకు.. అంటారా..? మరి పవన్ వారసుడు రాక కోసం అభిమానులు ఎన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. అంటే.. ఇప్పుడే సినిమా మొదలు పెట్టడం లేదు.. కానీ, నటనలో నైపుణ్యం పెంచుకోవడానికి ఫిల్మ్ స్కూల్ లో చేరాడు. దానికెందుకు అంతగా చెప్పాలి అంటే.. కారణం ఉంది. పవన్ వారసుడిగా అకీరా నందన్ ఉన్నప్పటికీ.. తల్లి రేణు దేశాయ్ దగ్గరనే అకీరా పెరుగుతున్నాడు. ఎన్నోసార్లు రేణు.. అకీరాకు సినిమాలు అంటే ఇష్టం లేదని, ఇప్పుడప్పుడే సినిమాల్లో అకీరా కనిపించే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చింది.
నాలుగోతరం వారసులతో కలిసి నార్వేలో ఉన్నాను. నా మనవడు కార్తికేయ, పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్… వీరిద్దరూ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరారు” అని వెల్లడించారు. ఈ మేరకు వారిద్దరితో తాను కలిసి ఉన్నప్పటి ఫొటోను రాఘవేంద్రరావు పంచుకున్నారు. పవన్ తనయుడు అకీరా ఇప్పటికే పలు రూపాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లోనూ, సంగీతంలోనూ శిక్షణ పొందిన ఈ మెగా ఇంటి కుర్రాడు ఇప్పుడు సినిమాల దిశగా తొలి అడుగు వేయడంతో పవన్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.