BREAKING : ఏపీలో బాలయ్య ఫ్లెక్సీని దగ్దం చేసిన అక్కినేని అభిమానులు

-

నెల్లూరు జిల్లాలో బాలయ్యకు బిగ్‌ షాక్‌ తగిలింది. అక్కినేని కుటుంబం పై సినీ నటుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నర్తకి సెంటర్ వద్ద బాలకృష్ణ ఫ్లెక్సీని దగ్దం చేసిన అభిమానులు..1984 నుంచే అక్కినేని కుటుంబం NTR ఫ్యామిలీపై అక్కసు వెళ్లగక్కుతుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ… బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అటు అనంతపురంలోనూ బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అక్కినేని అభిమానులు…లెజెండరీ యాక్టర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో కూడా బాలకృష్ణ చాలామంది మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారు…ఇప్పటివరకు దీనిపై ‘మా అసోసియేషన్’ ఎందుకు స్పందించలేదని నిలదీశారు ఫ్యాన్స్‌. వెంటనే బాలకృష్ణ వ్యాఖ్యల మీద మా అసోసియేషన్ స్పందించాలి…వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news