ఏపీ రైతులకు శుభవార్త..పశువుల అంబులెన్స్‌ సేవలు ప్రారంభం

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రెండో దశలో భాగంగా రూ. 112.62 కోట్లతో 165 డా. వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ ఆంబులెనన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వాహనాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున రూ.129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రూ. 111.62 కోట్లతో 165 వాహనాలు ప్రారంభమయ్యాయి. మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఈ అంబులెన్స్ ని తీసుకొచ్చారు. ఈ అంబులెన్స్ లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లమా సహాయకుడు, డ్రైవర్ కం అటెండర్ లను అందుబాటులో ఉంచారు. అంతేకాదు ప్రతి వాహనంలో 81 రకాల మందులు అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news