బాలీవుడ్ పార్టీలకి అందుకే అటెండ్ కాను..అక్షయ్ కుమార్

-

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఇటీవల లక్ష్మీ సినిమా విడుదలైన సందర్భంగా కపిల్ శర్మ షో కి అతిధిగా వచ్చిన అక్షయ్ కుమార్,, బాలీవుడ్ పార్టీలకి అటెండ్ కాకపోవడానికి కారణాలు చెప్పాడు. ముందుగా, కపిల్ శర్మ ప్రశ్న అడుగుతూ, మీరు బాలీవుడ్ పార్టీలకి అటెండ్ కాకపోవడానికి కారణం.. మీరు కూడా మళ్లీ పార్టీ ఇవ్వాల్సి వస్తుందనేనా? ఆ విధంగా డబ్బు ఖర్చు చేయడం మీకు ఇష్టం లేనందు వల్లేనా? అన్నాడు.

దానికి అక్షయ్ నవ్వుతూ, అవును అదే అన్నాడు. ఇంకా సమాధానం పూర్తి చేస్తూ, నిజానికి నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. రాత్రి తొమ్మిదింటికే నేను బెడ్ పై వాలిపోతాను. పొద్దున్న సూర్యుడు రాకుముందే మేల్కొంటాను. అందుకే పార్టీలకి నా దగ్గర సమయం ఉండదు. నాతో పాటు ఉండేవాళ్ళందరికీ తెలుసు.. నేను పార్టీలకి అటెండ్ కానని, అందుకే వాళ్ళు కూడా నన్ను పిలవడం మానేసారని బదులిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news