బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆర్బీఐ కొత్త రూల్స్..!

-

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్ ( RBI New Rules ) తీసుకు రావడం జరిగింది. దీనితో కస్టమర్స్ కి ఇక్కట్లు కలిగాయనే చెప్పొచ్చు. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ల రూల్స్ సవరించింది.

ఆర్బీఐ కొత్త రూల్స్ | RBI New Rules

ఇలా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో బ్యాంకుల్లో డబ్బులు పెట్టిన వాళ్ళు తప్పక దీని కోసం చూడాలి. మరి ఆ కొత్త రూల్స్ ఎలా వున్నాయి..? ఎలాంటి సమస్య వస్తుంది అనేది కూడా చూసేస్తే..

కొత్త రూల్స్ ప్రకారం మెచ్యూరిటీ గుడువు తీరిన తర్వాత, డబ్బులు తీసుకోకపోతే కనుక అప్పుడు ఆ డబ్బులపై తక్కువ వడ్డీ వస్తుంది గమనించండి. సేవింగ్స్ ఖాతాలకు వర్తించే వడ్డీ రేటే వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం మెచ్యూరిటీ తర్వాత ఎఫ్‌డీ డబ్బులు తీసుకోకపోతే బ్యాంకులు వాటిని మళ్లీ రెన్యూవల్ చేస్తున్నాయి.

కొత్త రూల్స్ ప్రకారం ఎఫ్‌డీ డబ్బులు గడువు తీరిన తర్వాత కూడా తీసుకోకపోతే తక్కువ వడ్డీ వస్తుంది అని చెప్పింది. కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, లోకల్ రీజినల్ బ్యాంకులకు ఆర్‌బీఐ రూల్స్ వర్తిస్తాయి అని కొత్త రూల్స్‌కు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యూలర్ ద్వారా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news