ఆర్‌బీఐ రూ.2 వేల నోట్లు వెనక్కి తీసుకుంటుందా..?

-

రూ.2000 నోట్ల చెలామణి తగ్గి పోతోంది. దీనితో రూ.2 వేల నోట్లు ఇక వుండేటట్టు కనపడడం లేదు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 2019-20తో పోలిస్తే 2020-21లో కరెన్సీ నోట్ల వినియోగం పెరిగింది. కరెన్సీ విలువ 16.8 శాతం, పరిమాణం 7.2 శాతం చొప్పున పెరిగాయి.

కానీ రూ.2 వేల కరెన్సీ నోట్లు మాత్రం 2019 నుంచి తగ్గుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సమయం లో రూ.500 నోట్ల వినియోగం మాత్రం పెరిగింది అని చెప్పచ్చు. 2019 వ సంవత్సరం లో 329.10 కోట్ల రూ.2 వేల నోట్లు చెలామణి లో ఉండేవి. కానీ ఇప్పుడు ఈ నోట్లు 245.1 కోట్లకు తగ్గాయి అని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటె విలువ పరంగా చూసుకున్నటైతే 2019లో రూ.2 వేల నోట్ల మొత్తం విలువ రూ.6.58 లక్షల కోట్లుగా ఉండేది. 2021లో రూ. 2 వేల నోట్ల వాటా 17 శాతానికి దిగొచ్చింది అని తెలుస్తోంది.

మనం గమనించినట్టైతే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 వేల నోట్ల ముద్రణను ఆపివేసినట్లు గతం లోనే ప్రకటించింది. కానీ ఇప్పుడు చెలామణిలో కొంచెం కొంచెం రూ.2000 నోట్లను తగ్గిస్తూ వస్తోంది. ఇలా ఈ పరిస్థితి కనుక కొనసాగితే అప్పుడు ఈ నోట్లు వుండవు అనే చెప్పాలి.
.

 

Read more RELATED
Recommended to you

Latest news