కరోనా మహమ్మారి ప్రభావం దీని మీద కూడా పడింది. కోవిడ్ 19 కేసులు రోజు రోజుకి ఎక్కువై పోతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడిపోతున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారిని కూడా పడింది అనే అనాలి. గ్యాస్ సిలెండర్ వాడే వాళ్ళు ఈ సమాచారాన్ని తప్పక తెలుసుకోవాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
ఈ మహమ్మారి కారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. గత 20 రోజుల్లో గ్యాస్ డెలివరీ సమయం ఒక్క రోజు నుంచి మూడు రోజులకు పెరిగింది. డెలివరీ సమయం పెరిగి పోవడానికి గల కారణం ఏమిటంటే..?
ప్రధాన వెండర్లకు కూడా కరోనా వైరస్ సోకడం వల్లనే. దీని తీవ్రత ఎక్కువగా ఉండడం తో గ్యాస్ డెలివరీ సమయం మరింత పెరిగే అవకాశముందని చెప్పుకోవచ్చు. 20 శాతం మంది డెలివరీ బాయ్స్‌కు కరోనా వచ్చినట్లు మనకి తెలుస్తోంది.
దీనితో గ్యాస్ వెయిటింగ్ పీరియడ్ మరింత సమయం పడే అవకాశం కనపడుతోంది. కరోనా వైరస్ జోన్‌లలో వచ్చే నెల రోజుల కాలంలో గ్యాస్ సిలిండర్ డెలివరీకి 4-5 రోజుల వరకు టైమ్ పట్టొచ్చని కూడా తెలుస్తోంది.
కాబట్టి సిలిండర్ అయిపోతే వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. లేదు అంటే ఇబ్బందులు తప్పవు. ఇది ఇలా ఉంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఏప్రిల్ నెలలో ఏకంగా 80 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.