నగర వాసులకు అలర్ట్..నీటి సరఫరాకు అంతరాయం

-

నగర వాసులకు అలర్ట్.. రేపు (గురువారం) కొన్ని చోట్ల మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.గురువారం ఉదయం 7 గంటల నుంచి ఒక రోజంతా నీటి సరఫరా జరగదని తెల్పింది. తాగునీటిని జాగ్రత్తగా, అవసరం ఉన్నంత వరకు ఉపయోగించాలని జలమండలి సూచించింది.

సిటీలో గల షేక్ పేట,జూబ్లీహిల్స్, బోరబండ,సోమాజిగూడ, మూసాపేట, చందానగర్,నల్లగండ్ల, హుడా కాలనీ, మణికొండ,హఫీజ్ పేట్, నర్సింగి, మంచిరేవుల, తెల్లాపూర్‌లో పూర్తిగా నీటి సరఫరా జరగదు. బోజాగుట్ట రిజర్వాయర్, బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ,ఎర్రగడ్డ, హైదర్ నగర్‌లో లో ఫ్రెషర్‌తో నీటి సరఫరా జరగనుంది.హైదరాబాద్‌కు మంచినీటి సరఫరా సింగూరు 3, 4 ఫేజ్‌ల ద్వారా సరఫరా అవుతోంది.సింగూరు నుంచి 132 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్ల నుంచి పవర్ సప్లై జరుగుతుంది. ఆ 2 సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో మరమ్మతులు చేపడుతోంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. పనులు పూర్తయిన తర్వాత సిటీలో మంచినీటి సరఫరాను పునరుద్దరిస్తామని జలమండలి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version