తెలంగాణ లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 6,19,825 క్యూసెక్కులుగా ఉంది. దాంతో వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ముందస్తుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకోసం నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తులల శాఖ కమిషనర్ కె. కన్నబాబు అన్నారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని చెప్పారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే బాసర పుణ్యక్షేత్రం వద్ద కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో వైపు మళ్లీ వర్షాలు వస్తాయిని వాతావరణశాఖ చెబుతోంది.