తిరుమల శ్రీ వారి దర్శనానికి వెళ్లాలనుకునే వారికి ముఖ్య గమనిక

-

తిరుమల శ్రీ వారి దర్శనానికి వెళ్లాలనుకునే వారికి ముఖ్య గమనిక, శ్రీ వారి దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే టిటిడి టోకెన్ లు జారీ చేస్తూ వస్తోంది టీటీడీ. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ అలాగే విష్ణు నివాసం టోకెన్ లు జారీ అవుతున్నాయి. భక్తులు సులువు గానే ఈ దర్శనం టోకెన్ లు పొందుతున్నారు.

ఈ నెల 30వ తేదీ వరకు దర్శనం టోకెన్ లను టిటిడి పంపిణీ చేస్తోంది. ప్రతి రోజు పది వేల రూపాయల చొప్పున టిటిడి భక్తులకు ఈ దర్శన టికెట్ల జారీ చేస్తోంది. భక్తుల రద్దీ గనుక పెరిగితే ఒకేసారి టోకెన్ లు ఇవ్వాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఇక ఈరోజు రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలు టీటీడీ మూసి వేయనుంది. చరిత్రలో తొలిసారిగా నాలుగు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news