ఆర్ ఆర్ ఆర్: ఆలియా వచ్చేసిందిగా..

-

ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. లాక్డౌన్ కారణంగా ఎనిమిది నెలల పాటు ఆగిపోయిన షూటింగ్, మళ్ళీ మొదలయ్యి ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మరో షెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో ఆలియా భట్ కూడా పాల్గొననుంది. ఈ మేరకు ఆలియా భట్ హైదరాబాద్ చేరుకుంది. ఎయిర్ పోర్టులో ఆలియా దిగిన ఫోటోలు వైరల్ కావడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిమిత్తమే వచ్చిందని ప్రచారం చేసారు.

ఐతే తాజాగా ఆలియా భట్, రాజమౌళిని కలిసిన ఫోటోని ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం షేర్ చేసింది. ఆలియాకి స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్న రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో ఆలియా నటిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా నటించట్లేదని రకరకాల వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ ఉన్నా కూడా ఇంకా ఏవేవో పుట్టించారు. మరి అలాంటి వాళ్ళకి ఈ సమాధానం సరిపోతుందేమో కదా!

Read more RELATED
Recommended to you

Latest news