జబర్దస్త్ కమెడియన్ మీద కిడ్నాప్ కేసు

-

జబర్దస్త్ కమెడియన్ లు తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో చాలా మంది తమ స్కిట్ లలో పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించి చిక్కుల్లో పడగా ఇప్పుడు ఒక కమెడియన్ సొంత బావ మీద దాడి చేసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ మీదా గూడూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ & దాడి కేసు నమోదయింది.

భూపతిపేటలో తన సోదరి భర్త మీద  కార్తీక్ స్నేహితులతో కలిసి దాడి చేసినట్టు సమాచారం. కార్తీక్ వెంట ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లు పోలీసులకు బాధితుడు రవి కుమార్ ఫిర్యాదు చేశాడు. తనను కిడ్నాప్ చేసి, సుమారు పదిహేను కిలో మీటర్లు దూరం కారు తీసుకెళ్ళి కొట్టించాడని ఫిర్యాదు చేశాడు రవి కుమార్. కార్తీక్ తో పాటు అతని తల్లిదండ్రులు, వెంట వచ్చిన వారి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news