ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ వారసురాలు అలియా బట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక క్యూట్ అందంతో కుర్రాళ్ళ మతులు పోగొట్టే అలియా నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా మంచి అభిమానులను సొంతం చేసుకున్న ఈమె తన నటనతో స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగడమే కాకుండా బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ కూడా ఈమె కావడం గమనార్హం. ఇక తెలుగులో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కూడా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఇక పోతే ఇదే ఏడాది తాను ప్రేమించిన రణ్‌బీర్ కపూర్ ను వివాహం చేసుకొని ప్రస్తుతం గర్భం దాల్చింది.. మరొకవైపు తన భర్తతో కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించడం.. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో శరవేగంగా పాల్గొంటోంది. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన గంగూభాయ్ కథియావాడి సినిమాలో కూడా అలియా ప్రధాన పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాలో అలియా వేశ్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అలియా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అలియా భట్ నటించిన గంగూభాయ్ కథియావాడి సినిమా ఆస్కార్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవెల్ లో మంచి ఆదరణ సంపాదించుకుంది.. కాబట్టి ఇలా ఆస్కార్ బరిలో నిలవబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అలియా భట్ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.