ఈ నెల 17న దేశ‌వ్యాప్తంగా స‌మ్మె చేయనున్న డాక్ట‌ర్లు..!

-

ఈ నెల 17వ తేదీన దేశ‌వ్యాప్తంగా డాక్ట‌ర్లంద‌రూ స‌మ్మె చేయాల‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ పిలుపునిచ్చింది. కోల్‌క‌తాలో జూనియ‌ర్ డాక్ట‌ర్లపై జ‌రిగిన దాడికి నిర‌స‌న‌గానే ఈ సమ్మెను చేప‌ట్టాల‌ని డాక్ట‌ర్లు పిలుపునిచ్చారు.

కోల్‌క‌తాలో గ‌త కొద్ది రోజుల కింద‌ట జూనియ‌ర్ డాక్ట‌ర్ల మీద దాడి జరిగిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు సేవ‌ల‌ను నిలిపి వేసి ఆందోళ‌నలు చేస్తుండ‌డంతో రోగులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. మ‌రో వైపు ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం జూనియ‌ర్ డాక్ట‌ర్ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ప‌శ్చిమ బెంగాల్‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు దేశ వ్యాప్తంగా అందరు డాక్ట‌ర్లు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 17వ తేదీన దేశ‌వ్యాప్తంగా డాక్ట‌ర్లంద‌రూ స‌మ్మె నిర్వ‌హించ‌నున్నారు.

ఈ నెల 17వ తేదీన దేశ‌వ్యాప్తంగా డాక్ట‌ర్లంద‌రూ స‌మ్మె చేయాల‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ పిలుపునిచ్చింది. కోల్‌క‌తాలో జూనియ‌ర్ డాక్ట‌ర్లపై జ‌రిగిన దాడికి నిర‌స‌న‌గానే ఈ సమ్మెను చేప‌ట్టాల‌ని డాక్ట‌ర్లు పిలుపునిచ్చారు. అలాగే దేశంలో ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో డాక్ట‌ర్లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. కోల్‌క‌తాలో జూనియ‌ర్ డాక్ట‌ర్లు విధుల‌ను బ‌హిష్క‌రించి ఆందోళ‌న‌లు చేస్తున్నారు. కాగా 17వ తేదీన స‌మ్మె కార‌ణంగా ఎమ‌ర్జెన్సీ సేవ‌ల‌ను కూడా నిలిపివేస్తామ‌ని అసోసియేష‌న్ తెలిపింది.

అయితే స‌మ్మెలో శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయ‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ తెలిపింది. వైద్యులు త‌మ‌కు క‌నీస భ‌ద్ర‌త క‌ల్పించ‌మ‌ని అడిగితే అందుకు ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని అసోసియేషన్ వైద్యులు తెలిపారు. కాగా డాక్ట‌ర్ల స‌మ్మెలో మొత్తం 3.5 ల‌క్ష‌ల మంది వైద్యులు పాల్గొన‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అయితే మ‌రోవైపు ప‌శ్చిమబెంగాల్‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు చేప‌ట్టిన ఆందోళ‌న‌పై, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికై వారం రోజుల్లో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించాల‌ని కోల్‌క‌తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..!

Read more RELATED
Recommended to you

Latest news