భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన తర్వాత వాళ్ల జీవితం అంతా తారుమారైంది. శోభానాగిరెడ్డి చనిపోయేవరకు వైసీపీలోనే ఉన్నారు. కానీ.. అమ్మ చనిపోయిన తర్వాత భూమా అఖిల ప్రియ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
భూమా అఖిల ప్రియ.. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. చిన్నవయసులో పెద్ద బాధ్యతను మోశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి మంచి పేరు ఉంది. ఆ పేరుతోనే వాళ్లు గత దశాబ్దాలుగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు.
అయితే.. భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన తర్వాత వాళ్ల జీవితం అంతా తారుమారైంది. శోభానాగిరెడ్డి చనిపోయేవరకు వైసీపీలోనే ఉన్నారు. కానీ.. అమ్మ చనిపోయిన తర్వాత భూమా అఖిల ప్రియ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రితో కలిసి టీడీపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో ఆమె వైసీపీ తరుపున గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు. అంతలోనే తన తండ్రి భూమా నాగిరెడ్డి కూడా మరణించారు.
తర్వాత ఆమె ఒక్కరే రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిపోయారు. దీంతో ఆమె పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మళ్లీ తన సొంతగూటికి వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆళ్లగడ్డలో ఓటమి ఎరుగని భూమా ఫ్యామిలీకి మొన్న టీడీపీ నుంచి ఓటమి ఎదురవడంతో టీడీపీని వీడాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. చూద్దాం.. మరి ఆమె మళ్లీ తన సొంత గూటికి వెళ్తారా? లేదా? అని. ఓవైపు ఏపీ సీఎం జగన్ మాత్రం ఏపీ నాయకులను ఎవ్వరినీ వైసీపీలో చేర్చుకోమని చెబుతున్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లు తమ పదవికి రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని అంటున్నారు. మున్ముందు ఏపీలో రాజకీయాలు ఎలా మారనున్నాయో ఏమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.