ఆఫ్ఘనిస్తాన్ లో పరిణామాలపై అఖిలపక్ష సమావేశం.. చర్చించే అంశాలివే.

-

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని చేతులెత్తేశాక ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలిబన్ల వశమైంది. దేశంలో రక్తపాతం చూడడం ఇష్టం లేకే దేశం విడిచి వెళ్ళిపోయానని అష్రాఫ్ ఘని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ లోని తాజా పరిణామాలపై భారత అఖిల పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశం ఎల్లుండి జరగనుంది. గురువారం రోజున అన్ని పార్టీలతో ఈ సమావేశం ఉండనుంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కేంద్రం తీసుకున్న చర్యలపై రాజకీయ పార్టీలకు వివరించాలని ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ శాఖ మంత్రికి సూచించారు. అదీగాక భవిష్యత్తులో ఆఫ్ఘన్ తో సంబంధాలు ఎలా ఉంటాయనే దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఆఫ్ఘన్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కాబూల్ నుండి రోజుకి రెండు విమానాలను నడుపుతున్నామని తెలిపారు. అక్కడ హిందువులు, సిక్కులతో పాటు స్థానికులను కూడా ఆదుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news