ముగిసిన అఖిలపక్ష ఎంపీల సమావేశం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

-

ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన సమావేశం ముగిసింది. కేంద్రం దగ్గర అపరిష్కృత అంశాలపై చర్చ జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది. నిధులపై పార్లమెంట్లో ఎలా పోరాడాలో చర్చించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్  ఎంపీలు
రాలేదు. దాదాపు 28 అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

విభజన సమస్యలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. మరోవైపు చివరి నిమిషంలో ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు గైర్హాజరు అయ్యారు. ఆహ్వానం ఆలస్యంగా అందిందని.. ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం కూడా లేదు.. ముందుగా నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నాం.. భవిష్యత్ లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే కాస్త ముందుగా తెలియాజేయాలని కిషన్ రెడ్డి భట్టికి లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news