కాశ్మీర్ నుచి కన్యా కుమారి వరకు కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి నితిన్ గడ్కరీతో చర్చించామని గుర్తు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి సిగ్నల్ ప్రీ హైవే ఏర్ెపాటు చేశాం. అలాగే తెలంగాణలో 10 నేషనల్ హైవేలను పూర్తి చేశామని తెలిపారు. వచ్చే నెలలో బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు.
రూ.300 కోట్లతో ఆరాంగర్ నుంచి శంషాబాద్ వరకు హై క్వాలిటీ రోడ్డు నిర్మించినట్టు తెలిపారు. ఆర్ఆర్ఆర్ అంచనా వ్యయం 18,722 కోట్లు అని కేంద్ర మంత్రి తెలిపారు. రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని కోరాం. రహదారుల ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సమావేశాల అనంతరం నితిన్ గడ్కరీ వస్తారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.