బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయవాడలో అయితే కొండ చరియాలు విరిగిపడ్డాయిన పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్ల పైకి చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాగులు, కాలువలు పొంగి పొర్లుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో కురుస్తునక్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి.. పలు జిల్లాలలో పాఠశాలకు సెలవు ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండాా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, విపత్తు నిర్శహణ శాఖ అలెర్ట్ మెజేజ్ లు గమనిస్తూ.. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాాాంతాల్లో బయటికీ రాకుండా ఉండటం చాలా ఉత్తమం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, టీడీపీ నేతలు సహాయక చర్యలకు తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు నారా లోకేష్ తెలిపారు.