కేదార్‌నాథ్ ఆలయం సందర్శన టైంలో యాత్రికులను తరలించేందుకు వినియోగించే ఓ క్రెస్టల్ హెలికాప్టర్ ఇటీవలే ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ సమస్య వచ్చి దెబ్బతిన్న విషయం తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ దానిని తరలించేందుకు ఆర్మీ ఎంఐ-17 చాపర్‌ను ఉపయోగించారు. ప్రత్యేకమైన కేబుల్స్‌తో క్రెస్టల్ హెలికాప్టర్‌ను చాపర్‌కు కట్టి తరలిస్తుండగా, కొద్ది దూరం ప్రయాణించగానే ఎంఐ-17కి అమర్చిన కేబుల్స్ అనుకోకుండా తెగిపోయాయి.
దీంతో వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాప్టర్ మందాకిని నది సమీపంలో జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.కేబుల్స్ తెగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ తరలిస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి పోస్టు చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.