రాత్రి 11 గంటల లోపే షాపులన్నీ మూసివేయాలి… పోలీసుల వార్నింగ్

-

కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో రాత్రి 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశించారు.వరుస ఘటనలతో గస్తీని పెంచాలని పోలీస్ యంత్రంగం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రాత్రి 10:30 దాటితే లాఠీ పోలీసే ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్ లోని పాత బస్తీలో అర్థరాత్రి అయినా జనం రోడ్ల మీద ఉండటంతో పోలీసులు మైక్ తో హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన నెట్టింట్లా వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. తెలంగాణ డీజీపీ, సీపీ హైదరాబాద్ సిటీకి ట్వీట్ ట్యాగ్ చేసిన అసదుద్దీన్ జూబ్లీహిల్స్‌లో పోలీసులు ఇలాంటి అనౌన్స్ మెంట్ చేశారా అని ప్రశ్నించారు. ఇరానీ ఛాయ్ హోటళ్లు, పాన్ షాపులు, లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ను కనీసం రాత్రి 12 గంటల వరకు తెరుచుకునేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ ఒకటే రూల్ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.దేశ వ్యాప్తంగా పెద్ద మెట్రో నగరాల్లో షాపులను రాత్రి వేళ తెరవడానికి అనుమతి ఇస్తాయని అని అన్నారు.కానీ హైదరాబాద్‌లో ఎందుకు భిన్నంగా ఉందని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news