జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే అతని గుర్తు ఏదో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. పవన్ చుట్టూ ఉండే వారందరూ క్రిమినల్సే నని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చేరి విజిల్స్ వేస్తున్న వారందరూ క్రిమినల్సేనని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కి క్రిమినల్ అంటే అర్థం కూడా తెలియదు అనుకుంటానన్నారు.
కులాల గురించి మాట్లాడను అంటూనే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి గుర్తే లేదని.. ఆయన ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో కూడా తెలియదని చురకలంటించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్న విశ్వరూప్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.