YCP పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ళ నాని..!

-

YCP పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు మాజీ మంత్రి ఆళ్ల నాని. గతంలో ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలకు రిజైన్ చేస్తూ పత్రిక ప్రకటన ఇచ్చాను. పార్టీ కి రాజీనామా అనేది నేను ప్రస్తావించలేదు. నా వ్యక్తిగత కారణాలవల్ల వ్యక్తిగత బాధ్యతల వల్ల… ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు. పార్టీ ఆఫీసు.. అంశంలో అపోహలు వద్దు. పార్టీ ఆఫీస్ విషయంలో పార్టీ అధిష్టానం దృష్టిలో లేకుండా చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

రెండు సంవత్సరాల కాలంగా పార్టీ ఆఫీసుకు స్థలాన్ని లీజుకి తీసుకున్నాము. స్థలం లీజు అయిపోయిన నేపథ్యంలో తాత్కాలిక షెడ్లను కూల్చివేశారు. ఎన్నికలకు మూడు నెలల ముందే మిథున్ రెడ్డి దృష్టిలోకి తీసుకు వెళ్ళాము దానిని హ్యాండ్ ఓవర్ చేయమని అప్పుడే చెప్పారు. పార్టీ కార్యాలయం అంశంలో దుష్ప్రచారం జరగడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది అని ఆళ్ళ నాని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news