రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జైపుర్ లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత గా కురుస్తున్న వర్షానికి జైపుర్ లోని కల్యాణ్ జీ కా రాస్తా ప్రాంతంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. శుక్రవారం రోజున ఈ భవనం కూలడంతో పక్కనే ఉన్న ఇతర ఇళ్లు కూడా భారీగా దెబ్బ తిన్నాయి. అయితే భవనం కూలిపోయే కొన్ని గంటల ముందే ఈ ప్రాంతంలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టం తప్పినట్లు చెప్పారు.
తొలుత ఇంటి ప్రహరీ కూలిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గుర్తించి ముందే ఆ ప్రాంతంలో ఉన్న 15 మందిని ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలించారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ఇంటి పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భవనం కూలుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పిందని నెటిజన్లు వారి పనితీరును ప్రశంసిస్తున్నారు.
జైపూర్లో వర్షం కారణంగా మూడంతస్తుల ఇల్లు కూలిపోయింది. ఈ ఘటన కళ్యాణ్జీ రోడ్డులో చోటుచేసుకుంది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. pic.twitter.com/AgPiAI0jxQ
— ChotaNews (@ChotaNewsTelugu) August 17, 2024