Allu Arjun: యంగ్ హీరో నాగ శౌర్య, తెలుగింటి అమ్మడు రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా..ఆ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా చిత్ర సీమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుదని, ఇలాంటి దుర్భర పరిస్థితి గత 40-60 ఏళ్లలో ఎన్నాడు చూడలేదని చెప్పుకొచ్చారు.
కరోనా వల్ల జనాలకు థియేటర్ కి వచ్చి.. సినిమాలు చూసే అలవాటు తగ్గింది. ఓ వైపు టికెట్ రేట్స్, మరో వైపు యాభై శాతం ఆక్యుపెన్సీ వంటి సమస్యలు కూడా కారణమని తెలిపాడు. ఆ ఇబ్బందులన్నీ తొలిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే గతంలో మాదిరి థియేటర్స్ కి వస్తున్నారు.
‘వరుడు కావలెను’ చిత్రంలో హీరోగా నటించిన నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మకు బెస్ట్ విషెస్ చెప్పారు.
అలాగే.. చిత్ర దర్శకురాలు లక్ష్మీ సౌజన్యకు బన్నీ స్పెషల్ విషెస్ చెప్పారు. ఓ మహిళ సినిమాకు దర్శకత్వం వహించడం అభినందనీయమని అన్నారు. సాధారణంగా అమ్మాయిలాగానే.. హీరోయిన్లలే కాదని, దర్శకులుగా, ఇతర టెక్నీషియన్లుగానూ మహిళలు రావాలని కోరారు.
ముంబయిలో తాను ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అక్కడి సిబ్బందిలో సగం మంది అమ్మాయిలే కనిపించారని, మన ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలు అనేక రంగాల్లో ప్రాతినిధ్యం వహించే రోజు రావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ సినిమా తాను చూశానని.. చాలా బాగుందని తెలిపారు.