అక్కడ అల్లు అర్జున్ జేమ్స్ బాండ్ ని దాటేసాడుగా..

-

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసింది. తెలుగు తెర మీద అద్భుత విజయం అందుకున్న అల వైకుంఠపురములో సినిమాకి బాలీవుడ్ లోనూ మంచి రివ్యూస్ వచ్చాయి. థమన్ అందించిన సంగీతం, త్రివిక్రమ్ దర్శకత్వం, అల్లు అర్జున్ డాన్సులు, నటన, పూజా హెగ్డే గ్లామర్ మొదలగునవన్నీ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి.

బుట్టబొమ్మ పాట ఇంటర్నెట్ లో ఎంత హల్చల్ చేసిందో తెలిసిందే. అటు మ్యూజిక్ పరంగా, ఇటు కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో, తాజాగా సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఐఎమ్ డీబీలో అత్యధిక వ్యూస్ సాధించిన 20ట్రైలర్లలో అల వైకుంఠపురములో ఏడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ జేమ్స్ బాండ్ సిరీస్ లో వచ్చిన నో టైమ్ టు డై సినిమాని వెనక్కి నెట్టి అల వైకుంఠపురములో ఈ ఫీట్ సాధించింది. దీన్ని బట్టి అల వైకుంఠపురములో బాక్సాఫీసు వద్ద ఎంతటి ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news