కమెడియన్ ప్రియదర్శి కొత్త సిరీస్.. ఆహాలోకి వచ్చేస్తుంది..

Join Our Community
follow manalokam on social media

మేజర్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లకి పోటీగా వచ్చిన తెలుగు ఓటీటీ ఆహా తన జోరు కొనసాగిస్తుంది. ప్రేక్షకులని ఎంగేజ్ చేయడానికి వరుసగా ఒకటి తర్వాత ఒకటి సినిమాలని, సిరీస్ లని వదులుతూ ఆసక్తి రేపుతుంది. ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో, అనగనగా ఓ అతిధి వంటి సినిమాలని రిలీజ్ చేసిన ఆహా, తాజాగా మరో కొత్త సిరీస్ తో ముందుకు వస్తుంది. కంబాల పల్లి కథలు పేరుతో రిలీజ్ అవనున్న ఈ సిరీస్ లో కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్నాడు.

స్వప్నా సినిమా బ్యానర్ పై రూపొందిన ఈ కథలు మరికొద్ది రోజుల్లో ఆహాలో స్ట్రీమింగ్ అవనున్నాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటించిన ఆహా, వినూత్నంగా ప్రచారం చేసింది. ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహిస్తున్నారు. ఆహా మెయిల్ గా వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

 

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...