బ‌న్నీని భ‌య‌పపెడుతోన్న సెంటిమెంట్‌: అల వైకుంఠ‌పురంలో ప్లాప్‌… !

-

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న అల వైకుంఠ‌పురంలో సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ముందుగా జ‌న‌వ‌రి 12న అల వైకుంఠ‌పురంలో రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌క‌టించినా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో న‌డుస్తోన్న వార్ నేప‌థ్యంలో సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అన్న చిన్న డౌట్ ఉంది.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా కావడం.. పాట‌లు తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే తిరుగులేని రికార్డులు సాధించ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. సినిమాపై ఎన్ని అంచ‌నాలు ఉన్నా ఓ బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం అటు బ‌న్నీతో పాటు బ‌న్నీ అభిమానుల‌ను కాస్త టెన్ష‌న్ పెట్టేస్తోంది.

గ‌త రెండేళ్ల‌లో సంక్రాంతికి వ‌చ్చిన పెద్ద హీరోల సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. 2018లో సంక్రాంతికి వ‌చ్చిన ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ అయ్యింది. గ‌తేడాది బోయ‌పాటి – రామ్‌చ‌ర‌న్ విన‌య విధేయ రామ కూడా డిజాస్ట‌ర్ అయ్యింది. ఇలా గ‌త రెండేళ్ల‌లో సంక్రాంతికి అంచ‌నాల‌తో వ‌చ్చిన సినిమాలు ప్లాప్ అయితే అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన సినిమాలు హిట్ అయ్యాయి.

మ‌రి ఇప్పుడు మ‌రో పెద్ద సినిమాతో పోటీగా భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న అల సినిమా ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి. డీజే, నా పేరు సూర్య లాంటి రెండు డిజాస్ట‌ర్ సినిమాల త‌ర్వాత బ‌న్నీ న‌టిస్తోన్న ఈ సినిమా బ‌న్నీకి హిట్ ఇస్తుందో ? లేదో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news