తేజ్ యాక్సిడెంట్ గురించి మొదట తెలిసింది బన్నికే..వెంటనే ఏం చేశాడో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది. తేజ్ బైక్ పై వెళుతుండగా స్కిడ్ అవ్వడం తో గాయాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే తేజ్ యాక్సిడెంట్ గురించి మొదట మెగా ఫ్యామిలీ లో అల్లు అర్జున్ కే తెలిసిందట. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వగానే మొదట అతడిని మెడి కవర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అల్లు అర్జున్ స్నేహితులు ఉండటం తో వెంటనే వాళ్ళు బన్నీ కి ఫోన్ చేసి తేజ్ యాక్సిడెంట్ గురించి చెప్పారు.

ప్రస్తుతం బన్నీ పుష్ప షూటింగ్ కోసం వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ వెంటనే ఆ విషయాన్ని చిరంజీవి కి ఫోన్ చేసి చెప్పారట. మెగాస్టార్ పవన్ కు ఇలా అందరికీ తెలియడం తో వెంటనే పవన్ ఆస్పత్రికి చేరుకుని సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తేజ్ కోలుకుంటున్నారు. ఆయన కి వైద్యులు నిన్న కాలర్ బోన్ సర్జరీ చేశారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణ లో తేజ్ ఉన్నారు. ఇక త్వరలో తేజ్ కోలుకుని వస్తారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.