డిగ్రీ డిస్క్… నిశ్చితార్థం లోనే ఛీ కొట్టిన యువతి..!

కాబోయే భర్త డిగ్రీ మధ్యలోనే ఆపేయడం తో ఓ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా లో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం మల్లాపురం గ్రామానికి చెందిన బీటెక్ చదివిన వ్యక్తికి ఈర్లపూడి లోని భాగ్య తండా కు చెందిన ఇక్బాల్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలో ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి చూపుల సమయంలో యువకుడు తాను డిగ్రీ పూర్తి చేశా అని యువతి కుటుంబ సభ్యులకు చెప్పాడు.

కానీ నిశ్చితార్థం సమయం లో అతడు డిగ్రీ పాస్ అవ్వలేదని మధ్యలోనే ఆపేశాడు అని యువతికి తెలిసింది. దాంతో ఆ యువతి వెంటనే తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థం రద్దు చేసుకుంది. ఈ సందర్బంగా యువకుడి కి యువతి కుటుంబ సభ్యులకు మధ్య గొడవ గరగ్గా యువతి తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.