కొత్త బిజినెస్ ప్రారంభించనున్న అల్లు అర్జున్

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్, ప్రస్తుత ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక తాజాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లుఅర్జున్ ఎదిగాడు. అంతేకాదు ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అనే బిరుదులు కూడా సంపాదించాడు అల్లు అర్జున్. హిందీ ప్రేక్షకులను కూడా ఈ సినిమాతో ఆకట్టుకున్నాడు.

ఈ చిత్రం హిందీ వర్షన్ ఇప్పటికే 75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు వరుస సినిమాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం అందుతోంది. దుస్తుల వ్యాపారాన్ని త్వరలోనే అల్లుఅర్జున్ ప్రారంభించ బోతున్నాడు. ఇప్పటికే తన బ్రాండ్ నువ్వు AA రూపంలో ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్… ఇప్పుడు అదే బ్రాండ్ నేమ్ తో దుస్తుల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాడు. వాస్తవానికి ఈ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్ లోకి రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. అతి త్వరలోనే ఈ బిజినెస్ ప్రారంభించబోతున్నారు అని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news