అల్లు అరవింద్ తెలుగు సినిమా నిర్మాతలలో మంచి ప్లానింగ్ వున్న నిర్మాత. తాను ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే దానిని ఎంతో లోతుగా ఆలోచించి కాని తీసుకోరు. ఇప్పుడు మరోసారి అల్లు అరవింద్ తెలివి తేటలు నిరూపితం అయ్యాయి. తాజగా కన్నడ సినిమా ‘కాంతార’ను కొని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయటం ఆయన మాస్టర్ మైండ్ కు నిదర్శనం.”కాంతారా మూవీ “రిషబ్ శెట్టి హీరోగా మరియు, దర్శకత్వం వహించిన కన్నడ సినిమా. ఈ సినిమా సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలై అఖండ విజయం సాధించింది.
డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.కేజీఎఫ్ లాంటి దేశంలో సంచలనం సృష్టించిన సినిమాలు నిర్మించి ఇండియాలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన హోంబలే ఫిలింస్ ‘కాంతార’ను నిర్మించింది. ఈ సినిమాను కన్నడలో చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వెంటనే తెలివిగా ఆలోచించి ,తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేశారు. రూ.2 కోట్లకు తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కొనుగోలు చేసినట్టు గా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా ను తెలుగులో మంచి తెలుగు సినిమా లాగే క్వాలిటీగా డబ్బింగ్ చెప్పించారు. ఈ సినిమా ను గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. సినిమాకు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయలేదు. ప్రభాస్, ధనుష్ లాంటి స్టార్ హీరోలు ఈ సినిమాను చూసి సూపర్ రివ్యూ లు ఇచ్చారు. దీనితో సాధారణం గానే సినిమా పై హైప్ వచ్చింది. దీనితో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మొదటి రోజే దుమ్ములేపింది. తొలిరోజే రూ.2.1 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అలా ఒక్కరోజులోనే డబ్బింగ్ రైట్స్ కు పెట్టిన మొత్తం రాబట్టింది. సినిమాకు మౌత్ పబ్లిసిటీ కూడా బాగా వచ్చింది. క్లైమాక్స్ అద్భుతంగా వుందని కామెంట్స్ వచ్చాయి. దీనితో ఈ సినిమా కూడా కేజీఫ్ లాగా సంచలన విజయం సాధిస్తుందని చెబుతున్నారు. దీనితో అల్లు అరవింద్ నక్క తోక తొక్కారని అంటున్నారు.