అల్లుడు అదుర్స్ డేట్ వచ్చేసింది..

-

రాక్షసుడు సినిమాతో తన కెరీర్లోనే మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రస్తుతం ప్రభాస్ సినిమా ఛత్రపతి హిందీ రేమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆల్రెడీ ఈ విషయమై ప్రకటన వచ్చేసింది కూడా. ఐతే హిందీలో సినిమా షూటింగ్ కి వెళ్లే ముందు తెలుగులో మరో సినిమాని రిలీజ్ చేయనున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల్లు అదుర్స్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన అల్లుడు అదుర్స్ సినిమా థియేటర్లలోకి రానుంది. నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని జి సుబ్రమణ్యం నిర్మించారు. రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయనున్నారట. మరి కరోనా కాలంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news