మన జీవితాలని మార్చుకుని విజయ పథంలోకి దూసుకుపోవడానికి మనకేవో అలవాట్లు ఉండాలని, అలాంటివన్నీ మనవల్ల కాదని అనుకుంటూ ఉంటారు. విజయవంతమైన వ్యక్తుల అలవాట్లు వేరుగా ఉంటాయని, అలాంటి వాటికి అలవాటు పడడానికి చాలా కష్టమని అనుకుంటారు. కానీ చిన్న చిన్న అలవాట్లే జీవితాలని మారుస్తాయని, ఆ అలవాట్లు అలవర్చుకోవడం కూడా చాలా తేలిక అని చాలా మందికి తెలియదు.
పాజిటివ్ థింకింగ్
ప్రస్తుతం కరోనా టైమ్ లో ఉన్నాం కాబట్టి పాజిటివ్ అనగానే భయపడిపోతున్నాం కానీ జీవితంలో పాజిటివ్ దృక్పథం చాలా అవసరం. సానుకూల దృక్పథం లేకపోతే జీవితాన్ని సరిగ్గా అనుభవించలేరు. జీవితంలో కష్టాలు ఎదురైనా సానుకూలంగా స్పందిస్తే ముందుఉ వెళతారు. లేదంటే జీవితం అక్కడే ఆగిపోతుంది.
వ్యాయామం
జీవితంలో ఎదగాలనుకునే వారు వారి శరీరాన్ని అందుకు తగిన విధంగా తయారు చేసుకోవాలి. అందుకే ప్రతీరోజూ వ్యాయామం ఖచ్చితంగా చేయాలి.
అనవసర విషయాలని వదిలివేయడం
మీకు అవసరం లేని వాటి గురించి అస్సలు బాధపడకండి. ఒక పని మీకు నిజంగా ఇబ్బంది కలిగిస్తే మాత్రమే ఆలోచించండి. అంతే కానీ అక్కడ అసలేమీ లేకపోయినా ఏదో జరుగుతుందన్న భయంతోనో, మరింకేదో కారణంతోనో అనవసర విషయాలని మనసును బాధపెట్టవద్దు.
ఎదుటివారి పట్ల దయ
అవతలి వారి పట్ల దయ కలిగి ఉండడం విజయవంతమైన వ్యక్తుల లక్షణం.
విశ్వాసం
మీరేదైనా మాటిచ్చినపుడు ఆ మాట నెరవేర్చుకునేలా చూడండి. అది మీ పట్ల ఎదుటివారిలో నమ్మకాన్ని పెంచుతుంది.
మీకోసం కొంచెం సమయాన్ని కేటాయించుకోండి
ఒకరోజులో కనీసం 5నిమిషాలైనా మీ గురించి ఆలోచించుకోండి. అందులో కేవలం మీ గురించి మాత్రమే ఉండాలి.
ప్రేమ
ఎదుటి వారి పట్ల మీలో నమ్మకాన్ని పెంచుతుంది. అవతలి వారు మిమ్మల్ని ప్రేమించేలా చేస్తుంది.