అల్లు ఫ్యామిలీ వారసుడిగా ఇప్పటివరకు తనకంటూ ఒక మంచి పేరునే తెచ్చుకున్న అల్లు శిరీష్ త్వరలోనే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాడట. విషయం ఏమిటంటే ఒక ప్రముఖ హీరో ను విమర్శిస్తూ అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసినట్లు తెలిసింది అయితే అది జరిగి చాలా రోజులు అయిపోయింది కానీ ఆ పోస్ట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
దీంతో ఎప్పుడెప్పుడా అని కాచుకొని ఉండే మన నెటిజన్లు అల్లు శిరీష్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇతర కథానాయకుల లాగా కాకుండా అల్లు శిరీష్ మాత్రం వారందరి ట్రోల్స్ కు చాలా ఘాటుగా స్పందించాడు. ఇలా తనపై బురద జల్లుతున్న వారందరి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన శిరీష్ తాను విమర్శలు చేసింది ఒకలా అయితే దాన్ని ఉపయోగించి కొందరు మరో విధంగా నెగిటివిటీ సీరియెట్ చేస్తున్నారని నెటిజన్లపై మండిపడ్డారు.
అలాగే ఇంకోసారి ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని అంతేగాకా వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేస్తానని హెచ్చరించారు.