గూగుల్‌ ఫోటోస్‌కు ప్రత్యామ్నాయాలు

Join Our Community
follow manalokam on social media

గూగుల్‌ ఫోటోస్‌ స్టోరేజీ సదుపాయం జూన్‌ 1 నుంచి 15 జీబీకి తగ్గనుంది. అదనంగా స్టోరేజీ కావాలంటే గూగుల్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరి గూగుల్‌ ఫోటోస్‌కు ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి? వాటిలో ఎంత జీబీ వరకు మన ఫోటోలను ఉచితంగా ఫైళ్లను స్టోర్‌ చేసుకోవాలంటే వాటి వివరాలు తెలుసుకుందాం.

గూగుల్‌ ఫోటోస్‌ ఉచితంగా స్టోరేజీని ఇస్తోంది. ఇటీవల క్లౌడ్‌ వి«ధివిధానాల్లో మార్పులు చేసినందుకు ఇకనుంచి 15 జీబీ స్టోరేజీ మాత్రమే వినియోగదారులు పొందనున్నారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి నిబంధనలు అమలులోకి రానున్నట్లు గూగుల్‌ తెలిపింది.

పరిమితి దాటితే ఏమవుతుంది?

2021 జూన్‌ 1 నుంచి 15 జీబీ పరిమితి దాటిన వినియోగదారులకు స్టోరేజీ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ని గూగుల్‌ అందిస్తోంది. గూగుల్‌ వన్‌ యాప్‌లో (జీమెయిల్, డ్రైవ్, ఫోటోసస్‌) మెమొరీ స్పేస్‌ను చూపిస్తుంది. దాని ద్వారా అనవసరమైన ఫైళ్లను డిలీట్‌ చేసుకోవచ్చు. అలా స్టోరేజీ ఆదా చేసుకోవచ్చు.
అదనంగా స్పేస్‌ కావాలనుకున్నవారు నెలవారీ చందా చెల్లించాలి. 100 జీబీకి రూ.130, ఏడాదికి 1300 చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్‌ ఫోటోస్‌ కాకుండా స్టోరేజీ సంస్థలు ఏవి? అవి ఎంతవరకు ఉచితంగా స్టోరేజీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయంటే..

అమెజాన్‌

గూగుల్‌ ఫోటోస్‌కు ఉత్తమ ప్రత్యామ్నయం అమెజాన్‌ ఫోటోస్‌. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్న వారికి 5 జీబీ వీడియో స్టోరేజీతోపాటు అపరిమిత ఫోటోస్‌ సదుపాయం ఉంటుంది.ప్రైమ్‌ లేకుంటే 5 జీబీ ఫోటోస్, వీడియో స్టోరేజీ మాత్రమే ఉచితం. 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ కోసం రూ.148 చెల్లించాలి.
ఈ సదుపాయం ప్రస్తుతం భారత్‌లో లేదు. రానున్న రోజుల్లో భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది.

వన్‌డ్రైవ్‌

365 మైక్రోసాఫ్ట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటే కొత్తగా స్టోరేజీ కోసం డబ్బులు చెల్లించాల్సిన పని లేదు.

డీజీబాక్స్‌

ఇది భారత్‌కు చెందిన సంస్థ. అత్యంత చౌకగా రూ.30 తో 100 జీబీ స్టోరేజీ వాడుకునే వీలుంది. రూ.360తో వార్షిక ప్లాన్‌ కూడా ఉంది.

డీగూ

స్టోరేజీ ఎక్కువ కావాలంటే ఇది సరైన ఎంపిక. ఎందుకంటే 100 జీబీ వరకు ఫైళ్లను ఉచితంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ విధానంలో భద్రంగా ఉంటుంది. మూడు డివైజ్‌లలో ఫైళ్లను అప్‌లోడ్‌ చేయాలి. డీగూకు సైన్‌అప్‌ చేసుకుంటే 5 జీబీ స్టోరేజీ అదనంగా వస్తుంది. 500 జీబీ కోసం నెలకు దాదాపు రూ.220, 10 టీబీ కోసం నెలకు రూ.735 చందా చెల్లిస్తే సరిపోతుంది. ఇతర ప్లాన్‌లతో పోలిస్తే ఇది తక్కువ.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...