తీవ్ర దు:ఖంలో హీరోయిన్ అమలా పాల్… ఏం జ‌రిగిందంటే..?

-

అమలాపాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా అమలా పాల్ ఇంట ఇప్పుడు విషాదం నెలకొన్నది. అమలా పాల్ తండ్రి వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించారు. 61 ఏళ్ల వయసున్న ఆయన గత కొన్నిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు క‌న్నుమూశారు. ఓ సినిమా షూటింగ్ లో ఉన్న ఆమెకు తండ్రి మరణ వార్త పిడుగులా తగిలింది. వెంటనే చెన్నై నుంచి కేరళ బయల్దేరింది.

ఈరోజు సాయంత్రం వర్గీస్ పాల్ అంత్యక్రియలను కురుప్పంపాడు చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. అమలాపాల్ సినిమాల్లోకి రావడం ముందు నుంచి పాల్‌కు ఇష్టం లేదు. కానీ తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీకి వచ్చింది. తక్కువ సమయంలోనే తమిళం, తెలుగు, మలయాళ పరిశ్రమల్లో సినిమాలు చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. కేవలం నటిగానే కాకుండా వివాదాల్లో కూడా ఈమె పేరు ఎప్పుడూ కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news