అత్యంత ఆరోగ్యకరమైన ఆకు కూరల్లో తోట కూర ఒకటి. ఇది చాల తక్కువ టైం లో జీర్ణం అవుతుంది. ఇది కళ్ళకు చాలా మంచిది. తోట కూరని సూర్యాస్తమయం తరువాత భూమి నుండి వేరు చేసి స్వీకరిస్తే దానిలో ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తుంది. తోటకూర ఎదుగుతున్న పిల్లలకు మంచి బలవర్ధకమైన ఆహారం.
ఒక కప్పు తోట కూర తీసుకుంటే అయిదు కోడి గుడ్లు, రెండు కప్పుల పాలు, మూడు కమలాలు ,ఇరవై అయిదు గ్రాములు మాంసం, అయిదు యాపిల్స్ గాని తీసుకున్నంత ఉపయోగం కలుగుతుంది.తోట కూర రోజు తీసుకుంటే జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. రక్తహీనతని పోగొడుతుంది. ఉడికించిన తోటకూరలో తేనే కలిపి గోధుమ రొట్టెతో తీసుకుంటే మలబద్దకం, గ్యాస్ట్రిక్, అల్సర్లు తగ్గిపోతాయి.
గుండె బలహీనంగా ఉన్నవారు, నరాల బలహీనంగా ఉన్నవారికి తోటకూర మంచి ఔషధం.తాజా తోటకూర రసంలో తేనె కలిపి ఆయా మందులతో పాటు సేవిస్తే త్వరగా వ్యాధులు తగ్గుతాయి తోటకూర ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి కూడా బాగా పనిచేస్తుంది.తోటకూర ఆకుల రసం ప్రతిరోజు తలకు రాస్తే శిరోజాలు ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి.
ఈ రసంలో కొద్దిగా పసుపు కలిపి ప్రతిరోజు ముఖానికి రాసుకుంటే మొటిమలు, ముడతలు అంతరించి చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. గజ్జి, దురద లాంటి వాటికి తోటకూర రసంలో కొద్దిగా సల్ఫర్ కలిపి పై పూత గా రాసి రెండు గంటలు ఉంచి స్నానం చేస్తే వ్యాధులు పోతాయి.