Breaking : రైతుల మహాపాదయాత్రపై ఏపీ హైకోర్టులో ముగిసిన విచారణ

-

అమరావతి రైతుల మహాపాదయాత్రపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. రైతుల తరుపు, ప్రభుత్వం తరుపు వాదనలు ముగిశాయి. రైతులు హైకోర్టు నిబంధనలు పాటించలేదు కాబట్టి పాదయాత్ర నిలుపుదల చేయాలని ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. అయితే.. ఈ సందర్భంగా రైతుల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… మహాపాదయాత్ర రాజమండ్రి చేరుకున్న సమయంలో వైసీపీ మంత్రులు,నేతలు పాదయాత్రపై అనుచిత వ్యాఖ్యలు చేయడం,రెచ్చగొట్టడం వంటి విషయాలను హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

మహాపాదయాత్రను నిలుపుదల చేయాలనే ఉద్దేశ్యపూర్వకంగా అధికార పార్టీ నేతలు,పోలీసులు వ్యవహరించిన తీరును ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్లామని, పాదయాత్ర చేస్తున్న రైతులకు షెల్టర్స్, ఆహారం,నీరు సరఫరా చేసేవారిని సైతం పోలీసులు ఇబ్బందులకు గురిచేసిన తీరును హైకోర్టుకు వివరించామన్నారు. ప్రభుత్వం, రైతుల తరుపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అమరావతి జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ.. మహాపాదయాత్రపై అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్న కుట్రను ఆధారాలతో సహా కోర్టు ముందుంచాం. సంఘీభావం తెలిపేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకోవడం,ఇబ్బందులు పెట్టడాన్ని కోర్టుకు తెలిపాం. హాపాదయాత్రపై అధికారపార్టీ నేతలు,మంత్రుల అనుచిత వ్యాఖ్యల వీడియోలను సమర్పించాం. కోర్టు ఆదేశాలు పాటిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version