టీడీపీ నేతలు సహా రాజధాని రైతుల హౌస్ అరెస్ట్..

-

రాజధాని గ్రామం అయిన కృష్ణాయపాలానికి చెందిన ఎస్సి, బిసి రైతులపై ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారికి సంకెళ్ళు వేసి జైలు కు తరలించడం పై రాజధాని ప్రాంతంలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో 3 రోజులు పాటు నిరసన కార్యక్రమాలకు జె ఏ సి పిలుపు నిచ్చింది. 3వ రోజు అయిన ఈరోజు ఆ రైతులను ఉంచిన గుంటూరు జిల్లా జైల్ కు భారీగా తరలి రావాలని ఛలో గుంటూరు కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. ఈ నేపధ్యంలో తుళ్ళూరు సహా అన్ని గ్రామాల్లో రైతులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

అంతే కాక జిల్లా వ్యాప్తంగా టిడిపి, సిపిఐ , అమరావతి జేఏసి నేతల హౌస్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు , టిడిపి ఇన్ చార్జ్ లు కోవెలమూడి రవీంద్ర, నసీర్ లని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఈ ఉదయం 9 గంటలకు రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల ప్రజలు తుళ్లూరు దీక్షా శిబిరంనకు చేరుకొని అక్కడి నుంచి చలో గుంటూరుకు బయలుదేరి వెళ్ళాలని జేఏసీ పిలుపునిచ్చింది. కృష్ణాయపాలెం దళిత, బి.సి. సోదరుల అక్రమ అరెస్టులకు మరియు ఇనుప సంకెళ్లు వేసి జైలుకు తరలించిన విధానం పై నిరసనగా “చలో గుంటూరు” కార్యక్రమం చేస్తున్నామని కాబట్టి అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెద్ద యెత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news