అధికారిని చేసిన అన్యాయం పై ప్రిన్సిపల్ సెక్రెటరీకి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి ఫిర్యాదు

-

ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయం ఉన్నతోద్యోగి వైఖరితో అన్యాయానికి గురైనా తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి పద్మావతి తనకు జరిగిన అన్యాయంపై ప్రిన్సిపాల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య బలిదానం  తర్వాత అప్పటి ప్రభుత్వం పద్మావతికి ఇంటర్ విద్యా శాఖలో ఉద్యోగం కల్పించింది. ఆ ఉద్యోగాన్ని చేస్తూనే లైబ్రరీయన్ గా ఎదగాలన్న సంకల్పంతో కష్టపడి చదివి దానికి సంబంధించిన అర్హతను సాధించింది. ఆ తర్వాత జూనియర్ కళాశాలలో లైబ్రరీయన్ గా సేవలు అందించాలని దరఖాస్తు చేసుకుంది.

ఇంటర్మీడియట్ విద్యలో మల్టిజోన్ 1లో 60 ఖాళీలు ఉండగా.. దురదృష్టవశాత్తు ఆమె నెంబర్ 61. అయినప్పటికీ ఆమె పేరును డిపార్ట్మెంట్ కమిటీ అప్రూవ్ చేసి ఈ 60 మందిలో ఏ ఒక్కరు చేరక పోయినా ఆమెకు ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా పేర్కొంది. అయితే 60 మందిలో ఏకంగా ముగ్గురు తమ వ్యక్తిగత కారణాల చేత ప్రమోషన్ వద్దని వ్రాత పూర్వకంగా లెటర్ ఇచ్చినప్పటికీ పద్మావతి కి మాత్రం ప్రమోషన్ రాలేదు. ఇంటర్ విద్యా శాఖలోని ముఖ్యమైన ఇద్దరు అధికారులకు, కమిషనర్ శృతి ఓజాకు అనేకసార్లు మొర పెట్టుకుంది. ఈ  వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ఆంధ్రా అధికారిణి కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి పద్మావతిని 100 సార్లు ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని.. ప్యానల్ ఇయర్ పూర్తయ్యింది కాబట్టి నీకు ప్రమోషన్ ఇచ్చేదే లేదని, కార్యాలయం నుంచి పంపించివేసింది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై పద్మావతి ప్రిన్సిపాల్ సెక్రెటరీని కలిసి తన బాధను, గోడును,  అన్యాయాల గురించి  కన్నీటి పర్యంతంగా నివేదించింది.

Read more RELATED
Recommended to you

Latest news