ఆవాలే క‌దా అని అనుకుంటే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో చూడండి..!

-

సాధార‌ణంగా కూరలకు తాళింపు పెట్టేటప్పుడు పోపు దినుసుగా ఆవాలను ప్రతీ ఇంట్లో వాడుతారు. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాల్లో డైటరీ ఫాట్స్‌, కార్బొహైడ్రేట్స్‌, ఫాట్‌, బీటా కెరోటిన్‌, విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కె, జింక్‌, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటివి అధిక మోతాదులో ఉన్నాయి. ఆవాలలో పోషక విలువలు మాత్రమే కాదు ఎన్నో ఔషధ విలువలు కూడా దాగి ఉన్నాయి. ఆవాలకు శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వు తగ్గించే గుణం ఉంది. ప్రతిరోజూ నాలుగు గ్రాముల ఆవాలను తినటం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఆవాల పొడిని సలాడ్స్‌, సూప్స్‌ వంటి వాటిల్లో వాడుతారు. వీటిని తీసుకుంటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ ఆవాలు ఎక్కువగా భారతీయ వంటకాల్లో వాడతారు. అలాగే ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. జుట్టు రాలిపోవటం, బట్టతల ఏర్పాడే లక్షణాలు కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాస్తే..మళ్లీ కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి.కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news