మూడేళ్ళ నుంచి వరుసగా రేప్ లు ఎక్కువగా జరిగే రాష్ట్రం అదే…!

-

దేశంలో అత్యధిక సంఖ్యలో అత్యాచారాలు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో వరుసగా మూడో ఏడాది కూడా మధ్యప్రదేశ్ కూడా నిలిచింది. బుధవారం విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం, 2018 లో నమోదైన దేశంలోని మొత్తం 33,356 అత్యాచార కేసులు నమోదు కాగా, ఒక్క మధ్యప్రదేశ్ లోనే 16 శాతం కేసులు నమోదు అయ్యాయి.

నివేదిక ప్రకారం, 2018 లో మధ్యప్రదేశ్‌లో ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 54 మంది బాధిత చిన్నారులతో సహా 5,433 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అత్యాచారం కేసుల సంఖ్య పరంగా 2016, 2017 లో కూడా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కానీ 2017 తో పోల్చితే 2018 లో నమోదైన అత్యాచార కేసుల సంఖ్య తక్కువ. రాష్ట్రంలో 5,562 కేసులు నమోదు అయ్యాయని నివేదిక పేర్కొంది.

అయితే, 2016 తో పోలిస్తే 2018 లో రాష్ట్రంలో అత్యాచార కేసుల సంఖ్య పెరిగిందని, 4,882 కేసులు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. 2018 లో 18 ఏళ్లలోపు బాధితులపై 2,841 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీరిలో 54 కేసుల్లో బాధితులు ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు కాగా, 142 మంది బాధితులు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాధితులు.

2018 లో రాష్ట్రంలో 1,143 కేసుల్లో బాధితులు 12 నుంచి 16 ఏళ్లలోపువారేనని, 1,502 కేసుల్లో 16 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నవారని నివేదిక పేర్కొంది. 2016 లో, మధ్యప్రదేశ్‌లో 2,479 అత్యాచార కేసుల్లో 18 ఏళ్లలోపు బాధితులు ఉన్నారు. వీరిలో ఆరేళ్ల లోపు 39 మంది బాలికలు ఉన్నారు. 2017 లో ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 50 మందితో సహా 18 ఏళ్లలోపు బాలికలపై 3,082 అత్యాచారం చేసిన కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news