అమెజాన్ యాప్ కొత్త సర్వీసులు..!

-

ప్రముఖ ఈ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్ ఇండియాలో మార్కెట్ పెంచుకోవడానికి జోరు పెంచింది. మార్కెట్ లో కొత్త వస్తువుల విక్రయాల కోసం కస్టమర్లకు ముందుకు రానుంది. తాజాగా ఈ సంస్థ తన వినియోగదారులకు మరో తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. అమెజాన్ లో 2 రకాల కొత్త సేవలు ఆవిష్కరించింది. ఈ కొత్త సేవలతో చాలా మంది కస్టమర్లకు ఉపయోగపడుతుందని ప్రకటించింది.

amazon
amazon

అమెజాన్ యాప్ లో తాజాగా ర్వైల్వే టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కోసం ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదర్చుకుంది. వినియోగదారులు ఇప్పుడు అమెజాన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తొలిసారిగా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకుంటే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చని తెలిపింది. గరిష్టంగా రూ.100 వరకు డబ్బులు వస్తాయని తెలిపింది.

దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు 12 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సదుపాయాన్ని కల్పించింది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పరిమిత కాలం వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెజాన్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులకు పేమెంట్ గేట్‌వే ఛార్జీల నుంచి కూడా మినహాయింపు దొరుకుతుందన్నారు. ట్రైన్ టికెట్ బుకింగ్ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ యూజర్లకు అందుబాటులో ఉంటుందన్నారు.

ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునే వారు ఒకే ట్రాన్సాక్షన్‌పై ఆరుగురికి బుక్ చేయోచ్చు. తత్కాల్ టికెట్ అయితే నలుగురికి బుక్ చేయోచ్చని తెలిపింది. అమెజాన్ లో టికెట్లు బుక్ చేసుకునే వారు 120 రోజులు (4 నెలల) ముందు బుక్ చేసుకోవాలని తెలిపింది. ఈ సర్వీసులతో పాటు అమెజాన్ మరో కొత్త సర్వీసులు కూడా తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు తమ క్రెడిట్ కార్డు బిల్లులను అమెజాన్ యాప్ ద్వారా కట్టేయవచ్చని ప్రకటించింది. ఈ సదుపాయాలను కస్టమర్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలని అమెజాన్ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news