అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్ ఫోన్.. ధ‌ర ఎంతంటే..?

-

శాంసంగ్ సంస్థ కొత్త‌గా ఎఫ్ సిరీస్‌లో గెలాక్సీ ఎఫ్‌41 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఎఫ్ సిరీస్‌ను కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్ట‌గా, అందులో వ‌చ్చిన మొద‌టి ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇక ఇందులో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఎగ్జినోస్ 9611 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 6జీబీ వ‌ర‌కు ర్యామ్ ఇందులో ల‌భిస్తుంది. వెనుక వైపు 64, 8, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడింటిని ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

Samsung launched Galaxy F41 smart phone

ఈ ఫోన్‌లో ఉన్న సింగిల్ టేక్ ఫీచ‌ర్ స‌హాయంతో ఒకే సారి క్లిక్ చేసి ఏకంగా 7 ఫోటోలు, 3 వీడియోలు తీసుకోవ‌చ్చు. ఒక్కో వీడియో ఫుటేజ్ నిడివి 10 సెక‌న్లు ఉంటుంది. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. దీంట్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని అమ‌ర్చారు. దీనికి 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల బ్యాట‌రీ వేగంగా చార్జింగ్ అవ‌డ‌మే కాదు, ఎక్కువ బ్యాక‌ప్‌ను ఇస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌41 స్పెసిఫికేష‌న్లు…

* 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెస‌ర్
* 6జీబీ ర్యామ్‌, 64, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 64, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌41 స్మార్ట్‌ఫోన్ ఫ్యుష‌న్ గ్రీన్‌, ఫ్యుష‌న్ బ్లాక్‌, ఫ్యుషన్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999 ఉంది. అలాగే 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.17,999గా ఉంది. అక్టోబ‌ర్ 16 నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు. అదే రోజు అందులో బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. క‌నుక అందులో ఈ ఫోన్ ను మరింత త‌గ్గింపు ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అలాగే ఎస్‌బీఐ కార్డుల‌తో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. దీంతో ఈ ఫోన్ ధ‌ర ఇంకా త‌గ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news