అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ జ‌రిగేది అప్పుడే.. తేదీని ప్ర‌క‌టించిన అమెజాన్‌..

-

ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల నేప‌థ్యంలో ఈ-కామ‌ర్స్ సంస్థలు ప్ర‌త్యేక సేల్‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అందులో భాగంగానే ఇప్ప‌టికే ఫ్లిప్‌కార్ట్ త‌న బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌ను జ‌రిగే తేదీల‌ను ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఇప్పుడు అమెజాన్ త‌న గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ జ‌రిగే తేదీల‌ను వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 17 నుంచి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ జ‌ర‌గ‌నుంది. ఈ సేల్‌ను అక్టోబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

amazon great indian festival sale starts on october 17th

కాగా అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు 24 గంట‌లు ముందుగానే అందుబాటులోకి రానుంది. అక్టోబ‌ర్ 16 నుంచే వారు సేల్‌లో పాల్గొన‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు ఉన్న‌వారు ఈ సేల్‌లో 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. సేల్‌లో భాగంగా వ‌న్‌ప్ల‌స్ టీవీల‌ను కూడా విక్ర‌యించ‌నున్నారు.

ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియ‌న్ డేస్ సేల్ అక్టోబ‌ర్ 16న ప్రారంభం కానుండ‌గా అక్టోబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు కొన‌సాగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ మెంబ‌ర్ల‌కు అక్టోబ‌ర్ 15 నుంచే ఈ సేల్ అందుబాటులోకి వ‌స్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news