4వ జ‌న‌రేష‌న్ ఎకో డివైస్‌ల‌ను లాంచ్ చేసిన అమెజాన్‌..!

-

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నూత‌నంగా 4వ జ‌న‌రేష‌న్ ఎకో డివైస్‌ల‌ను లాంచ్ చేసింది. ఎకో డివైస్‌ల ద్వారా వినియోగ‌దారులు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ స‌హాయంతో వాతావ‌ర‌ణం, వార్త‌లు, ఇత‌ర వివ‌రాలు తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే మ్యూజిక్ కూడా విన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ డివైస్ ల‌ను 4వ జ‌న‌రేష‌న్ మోడ‌ల్స్ రూపంలో అమెజాన్ విడుద‌ల చేసింది. అమెజాన్ ఎకో, ఎకో డాట్‌, ఎకో డాట్ విత్ క్లాక్ డివైస్‌లు ప్ర‌స్తుతం విడుద‌ల‌య్యాయి.

Amazon launched 4th generation  Echo devices

నూత‌న ఎకో డివైస్‌ల‌ను ప్ర‌త్యేకంగా గోళాకారంలో డిజైన్ చేశారు. అందువ‌ల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. శ‌బ్దం అన్ని వైపుల‌కు ప్ర‌సార‌మ‌వుతుంది. లో ప‌వ‌ర్ మోడ్ ను అందిస్తున్నారు. డాల్బీ స్టీరియోకు సపోర్ట్‌ను ఏర్పాటు చేశారు. బ్లూటూత్ ద్వారా ఇత‌ర డివైస్‌ల‌కు ఇవి క‌నెక్ట్ అవుతాయి.

ఎకో డివైస్ ధ‌ర రూ.9,999 ఉండ‌గా, ఎకో డాట్ ధ‌ర రూ.4,499గా ఉంది. అలాగే ఎకో డాట్ విత్ క్లాక్ డివైస్ ధ‌ర రూ.5,499గా ఉంది. వీటికి ప్రీ ఆర్డర్ల‌ను శుక్ర‌వారం నుంచే ప్రారంభించారు. అక్టోబ‌ర్ 26 నుంచి అమెజాన్‌లో వీటిని విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news