రోజు రోజుకి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో ఫీచర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘పే పర్ వ్యూ’ సర్వీసును తీసుకు రాగ దీని వలన యూజర్లు ఇండివిడ్యువల్ మూవీలను రెంట్‌లో చూసుకోచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
పే పర్ వ్యూ ని ప్రైమ్ సబ్‌స్క్రయిబర్లకు, నాన్ ప్రైమ్ సబ్‌స్క్రెయిబర్లకు కూడా అందుబాటులోకి ఉంటోంది. ప్రైమ్ వీడియో యాప్, వెబ్‌సైట్ లో ఒక ప్రత్యేక ట్యాబ్‌ను దీని కోసం అందించారు. ఒక్కసారి చూసేందుకు యూజర్లు రూ.69 నుంచి రూ.499 వరకు పేమెంట్ చేయాలి. అయితే మీరు చూడాలనుకున్న కొత్త మూవీని యూజర్లు కొనుగోలు చేసిన 30 రోజుల తర్వాత రెంట్‌లో అందుబాటులోకి వస్తోంది.
తర్వాత 48 గంటల్లో యూజర్లు సినిమా చూడచ్చు. కొత్త మూవీలను యూజర్లకు త్వరగా యాక్సస్ అందించేందుకు ఈ సరికొత్త సర్వీసును మొదలు పెట్టారు. కొత్త సినిమాలను యూజర్లు ముందే యాక్సస్ పొందేలా రెంట్ బేసిస్ లో ఈ ఫీచర్‌ను తీసుకు వచ్చారు.
అంతే కాక రాబోయే రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో 40 కొత్త ఫిల్మ్స్‌ను, సిరీస్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వచ్చే 24 నెలల్లో తన ఒరిజినల్ సిరీస్‌ను, సినిమాలను లాంచ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీసు భారత్‌తో ఐదేళ్లను పూర్తి చేసుకుంది.